ఎవడు బ్రో నీకు చెప్పింది…రానా

దగ్గు బాటి రానాసోషల్ విూడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అప్పుడప్పుడు తనపై వచ్చే విమర్శలకు
ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆయన నటించిన ’విరాట పర్వం’ సినిమాకి సంబంధించి ఓ వెబ్ సైట్ కథనం రాసింది. ఈ సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తప్పుకున్నాడంటూ పబ్లిష్ చేయగా, దానికి రిప్లై ఇచ్చిన రానా .. ’ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది’ అంటూ చేసాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేసారు. డిసెంబర్‌లో చిత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లు అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టడటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో రానా నక్సలైట్‌గా కనిపించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.