ఓటిటిలో విడుదల కానున్న రిపబ్లిక్‌

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో నటించిన చిత్రం రిపబ్లిక్‌. దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో అక్టోబర్‌ 1న విడుదలైంది. ఐశ్వర్య రాజేశ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. తొలి షో నుంచే సినిమా బాగుందని టాక్‌ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. దీంతో బాక్సాఫీసు వద్ద పరాజయంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో రాబోతోంది. రిపబ్లిక్‌ సినిమా ఓటీటీలో వచ్చే తేదీ ఫిక్సయిపోయింది. రిపబ్లిక్‌ సినిమా విడుదల సమయానికి బైక్‌ యాక్సిడెంట్‌కు గురైన సాయిధరమ్‌ తేజ్‌ ఆస్పత్రిలోనే ఉన్నాడు. దీంతో మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ దగ్గరుండి ఈ సినిమా ప్రమోషన్‌ చేశారు. దానికి తగ్గట్టే ఓపెనింగ్స్‌ కూడా భారీగానే వచ్చాయి. సినిమా కూడా బాగుందని టాక్‌ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. సినిమా చివర్లో హీరో పాత్ర చనిపోవడం జనాలకు రుచించలేదు. పైగా కరోనా భయంతో చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇష్టపడలేదు. దీంతో బాక్సాఫీసు వద్ద సినిమా బోల్తా పడిరది. రూ.12.5 కోట్ల బరితో దిగిన ఈ సినిమా కేవలం 6.85 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టింది. బయ్యర్లకు రూ.5.65 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎª`లాట్‌ఫామ్‌లో త్వరలోనే స్టీమ్రింగ్‌ కానుంది. డిజిటల్‌ స్టీమ్రింగ్‌ తేదీని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ`5 ప్రకటించింది. ఈ నెల 26 నుంచి జీ5 యాప్‌లో రిపబ్లిక్‌ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపింది