అగ్రశ్రేణిలో దూసుకుపోతున్న పూజా

టాలీవుడ్‌ లోని టాప్‌ మోస్ట్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌ లో ముందు వరుసలో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. మదర్‌ ల్యాండ్‌ కన్నడ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి, అభినయానికి ఫిదా అయిపోయారు. వరుసగా ఐదు సూపర్‌ హిట్స్‌తో అమ్మడు ప్రస్తుతం లీడిరగ్‌ లో ఉంది. మరో హిట్‌ పడితే.. ఆమె డబుల్‌ హ్యాట్రిక్‌ కూడా అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాల లైనప్‌ ఓ రేంజ్‌ లోఉంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా అమ్మడు నటిస్తోంది. ఇక పూజా హెగ్డే కి ఇన్‌ స్టాలో కూడా ఓ రేంజ్‌ లో ఫాలోయింగ్‌ ఉంది. తరచుగా తన హాట్‌ పిక్స్‌ తో నెటిజెన్స్‌ ను కవ్విస్తూంటుంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన పిక్స్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ గా మారాయి. ఎల్లో కోట్‌ విత్‌ ఫ్యాంట్స్‌ కాస్ట్యూమ్స్‌ లో పూజా హెగ్డే ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతోంది.  అందాల్ని కోట్‌ తో కవర్‌ చేస్తూ ఆమె ఇచ్చిన సెన్సువల్‌ పోజులకు కుర్రకారు మతులు పోతున్నాయి. ఈ పిక్స్‌ కు ఒక్కరోజులోనే ఏకంగా 7లక్షలకు పైగానే లైక్స్‌ పడ్డాయి. ఆమె అందానికి దాసోహం అవుతూ.. కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజెన్స్‌. గ్లామరస్‌ పోజులివ్వడంలో జిగేల్‌ రాణికి మంచినవారు లేరని చెప్పుకుంటున్నారు. మరి పూజా హాట్‌ పోజులకు మరిన్ని పెద్ద ఆఫర్స్‌ ఆమెను వరిస్తాయేమో చూడాలి.