దెయ్యం లుక్‌లో హౌరా అనిపించిన చిరు

మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు కొత్త లుక్స్‌లో కనిపిస్తూ కేక పెట్టిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో గుండు ఫొటోతో కనిపించి అందరికి పెద్ద షాకే ఇచ్చారు. ఇక తాజాగా దెయ్యం లుక్‌లో నయా అవతార్‌ను చూపించారు. ఈ లుక్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. మరి చిరు అలా కనిపించడం వెనకు కారణం హాలోవీన్. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు హాలోవీన్ ఉత్సవాలను జరుపుకున్నారు. వింతైన గెటప్పుల్లో ఫన్ క్రియేట్ చేశారు. భయంకరమైన దుస్తుల్ని ధరించి సరదా పార్టీల్లో నిమగ్నమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ విూడియాలో హాలీవీన్ పార్టీ వీడియోను షేర్ చేయగా అది వైరల్ గా మారింది. నిహారిక కూడా తన భర్తతో కలిసి డిఫరెంట్ గెటప్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య మూవీ ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇక లూసిఫర్ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ’గాడ్ ఫాదర్’ చిత్రీకరణ దశలో ఉండగా.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ’భోళా శంకర్’ త్వరలో పట్టాలెక్కనుంది. బాబీ దర్శకత్వంలో కూడా చిరు ఓ మూవీ చేయనున్నారు.