సినీ పరిశ్రమకు విషాదం మిగిల్చిన పునీత్‌

పునీత్‌ రాజ్‌ కుమార్‌ హఠాన్మరణం ఆయన అభిమానులు,కుటుంబ సభ్యులకే కాదు సినీ పరిశ్రమకు తీరని శోకాన్ని మిగిల్చింది. పునీత్‌ హీరోగా జేమ్స్‌, ద్విత్వ సినిమాలు షూటింగ్‌లో ఉండగా,ఆయన కన్నుమూశారు. మొదటిది షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇందులో పునీత్‌ బాడీ బిల్డర్‌గా నటిస్తున్నాడు. జేమ్స్‌ సినిమా బ్జడెట్‌ దాదాపు 60 కోట్ల రూపాయలు. ఈ సినిమా ఒక్క షెడ్యూల్‌ మాత్రమే మిగిలి ఉంది ఈ లోపే ఇలా జరగడంతో ఈ సినిమా భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ మూవీకి సంబంధించి పునీత్‌ యాక్షన్‌ పార్ట్‌ పూర్తయిందట. అలాగే సినిమా కూడా చాలా వరకూ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుందట. ఈ సినిమాను అభిమానుల కోసం వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. కాకపోతే ఆయన వాయిస్‌ కాకుండా వేరే వాయిస్‌ తో డబ్బింగ్‌ చెప్పిస్తే.. ఎవరికీ సంతృప్తికరంగా ఉండదనిపించి.. దీని కోసం సరికొత్త టెక్నాలజీ ఉపయోగించబోతున్నారట. జేమ్స్‌’ షూటింగ్‌ సమయంలో పునీత్‌ రాజ్‌ కుమార్‌ పలికిన డైలాగ్స్‌ ను.. సరికొత్త టెక్నాలజీతో క్వాలిటీ పెంచి విజువల్స్‌ కు సింక్‌ చేయబోతున్నారని సమాచారం. దీని కోసం ఓ ముంబై కంపెనీ రంగంలోకి దిగుతోంది. వచ్చే ఏడాది మార్చ్‌ 17న పునీత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట.