జక్కన్న మార్క్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌ విడుదల

అభిమానులకు పండగ కానుకగా విడుదల

జక్కన్న రాజమౌళి మార్కు ఆర్‌ఆర్‌ఆª` గ్లింప్స్‌ విడుదలయ్యింది. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ’ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ మొదలయ్యాయి. ఇందులో భాగంగా ’ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సినీ ప్రేమికులందరికీ సోమవారం ఉదయం ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటిస్తోన్న ఈ సినిమా నుంచి దీపావళి కానుకగా ఓ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ’ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌’  పేరుతో 45 సెకన్ల నిడివి ఉన్న ఈ స్పెషల్‌ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకూ వచ్చిన సర్‌ప్రైజ్‌లకు భిన్నంగా రామ్‌చరణ్‌`తారక్‌ కలిసి ఉన్న సన్నివేశాలతో ఈ వీడియో రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల బ్జడెట్‌తో ఈ సినిమా సిద్ధమవుతోందని అంచనా. ఇందులో రామ్‌చరణ్‌  అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ ఈసినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్నారు. ఇక, తారక్‌కు జంటగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. భారీ బ్జడెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందించగా, ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ’భీమ్‌ ఫర్‌ రామరాజు’, ’రామరాజు ఫర్‌ భీమ్‌’ వీడియోలు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించినప్పటికీ వాటిల్లో తారక్‌`చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో తొలి సారి రామ్‌ చరణ్‌` ఎన్టీఆర్‌ జంటగా కనిపించే సరికి అభిమానులు పూనకంతో ఊగిపోతున్నారు. రాజమౌళి అత్యద్భుతంగా సన్నివేశాలని చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ గ్లింప్స్‌ మూవీపై భారీ అంచనాలు పెంచిందనే చెప్పాలి. కేవలం 45 సెకన్లు ఉన్న ఈ వీడియోలో డైలాగ్స్‌ ఏం లేకుండా కేవలం ఉత్కంఠభరితమైన సన్నివేశాలు మాత్రమే చూపించారు. వీడియో ఆకట్టుకునేలా ఉంది. రానున్న రోజులలో మూవీకి సంబంధించి మరింత జోరుగా ప్రమోషనల్‌ కార్యక్రమాలు చేపట్టనున్నారు. జనవరి 7న సినిమాని థియేటర్స్‌లోకి తీసుకురానున్నారు.  కోవిడ్‌`19 మహమ్మారి కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘ విడుదల తేదీ చాలా సార్లు వాయిదా పడిరది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్‌ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది.