నాగచైతన్య ఫోటోస్ డిలీట్

ఐదేళ్ళ ప్రేమ బంధానికి, నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి చెప్పి.. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నామంటూ ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు చైతూ, సామ్. అప్పటి నుంచి వారి బ్రేకప్ కు కారణాలేంటనే కోణంలో సోషల్ విూడియాలో ఇప్పటికీ అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చైతూ, సామ్ ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు లీడ్ చేస్తున్నారు. ఈ కష్టకాలాన్ని వీలైనంత త్వరగా మరిచిపోడానికి సమంత తీర్ధయాత్రలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హాలీడేస్ తో ఇన్ స్టాలో వాటికి సంబంధించిన ఫోటోస్ ను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్యతో బ్రేకప్ అయిన తర్వాత కూడా ఇన్ స్టాలో ఆయన్ని పక్కన పెట్టకుండా.. ఇంకా ఫాలో అవుతూ ఉన్న సామ్.. రీసెంట్ గా చైతూతో తన బంధానికి గుర్తుగా ఉన్న మొత్తం 80 ఫోటోస్ ను డీలీట్ చేసింది. ఫ్రెండ్స్ తోనూ, పెట్ డాగ్స్ తోనూ తాము దిగిన ఫోటోస్ ను కాకుండా.. తామిద్దరూ కలిసున్న ఫోటోస్ ను మాత్రమే సమంతా డీలీట్ చేయడం గమనార్హం. దీన్ని బట్టి చైతూ జ్ఞాపకాల్ని శాశ్వతంగా చెరిపేసి ముందుకు సాగాలని సామ్ కోరుకుంటున్నట్టు అర్ధమవుతోంది. రాబోయే రోజుల్లో ఆమె మిగిలిన ఫోటోస్ ను కూడా తొలగించి.. చైతూని అన్ ఫ్రెండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.