సారంగదరియా పాటకు స్టెప్పులేస్తే గిఫ్టులు

లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా..పాట యూట్యూబ్‌లో ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలైన నెల రోజుల్లోనే 10కోట్ల వ్యూస్‌తో రికార్డు నెలకొల్సిన సారంగ దరియా పాట.. అతి తక్కువ కాలంలోనే 25కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా 30 కోట్ల మార్కును దాటింది. దక్షిణాదిలో మరే లిరికల్ వీడియో సాంగ్‌కు సాధ్యంకాని రికార్డును దక్కించుకుంది. రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ తెలంగాణ జానపదాన్ని.. సింగర్ మంగ్లీ పాడిరది. ఈ పాటలో సాయి పల్లవి క్యూట్ లుక్స్‌తోపాటు స్టెప్పులతో అదరగొట్టింది. దీంతో ఈ పాటకు యూట్యూబ్‌లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో లవ్ స్టోరీ సినిమా రూపొందింది. సారంగదరియా పాటను శేఖర్ మాస్టర్, ఆనీ మాస్టర్ కలిసి కొరియోగ్రఫీ చేసినట్టు తెలుస్తోంది. అయితే శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ ఇది వరకే ఓ ఈవెంట్‌లో ఆ స్టెప్పులు వేసింది. ఇప్పుడు మరోసారి రచ్చ చేసింది. ఈ వీడియోని షేర్ చేసిన శేఖర్ మాస్టర్.. విూరు కూడా విూ వర్షన్‌లో డ్యాన్స్ దరియాను చేసి మాకు పంపించండి. బాగా చేసిన వారిలోంచి ఐదు గురికి ఆహా నుంచి స్మార్ట్ ఫోన్లు లభిస్తాయని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.