నేడు ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి సస్పెన్స్‌ న్యూస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ’ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నుంచి ఊహకందని సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు రాజమౌళి టీమ్‌. ఆయన దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ మూవీ ’రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ’ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మేకర్స్‌ ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను రివీల్‌ చేశారు. ’ఈ అక్టోబర్‌ 29న శుక్రవారం ప్రపంచంలోని ఏ చిత్రానికి ఇంతకు ముందెన్నడూ చూడని, వినని కొలాబరేషన్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి’.. అని రాజమౌళి టీమ్‌ ట్వీట్‌ చేసింది. దాంతో వీరు ఇవ్వబోతున్న అప్‌డేట్‌ ఏంతో అనే ఆసక్తితో అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ 10 భాషలలో రిలీజ్‌ కానుంది. బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ ఆలియా భట్‌, బ్రిటన్‌ మోడల్‌ ఓలివియా మోరీస్‌, అజయ్‌ దేవగణ్‌, శ్రియ శరణ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు.