హిందీలో రీమేక్‌గా వస్తోన్న ఆర్‌ఎక్స్ 100
ఎలాంటి అంచనాలు లేకుండాప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డుల మోత మోగించిన చిత్రం ఆర్‌ఎక్స్ 100. అజయ్ భూపతి, కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ ముగ్గురికి తొలి ఎంట్రీతోనే బిగ్గెస్ట్ హిట్ అందించింది ఆర్‌ఎక్స్ 100. ఇపుడీ సూపర్ హిట్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి
కుమారుడు అహాన్ శెట్టి , తారా సుటారియా హీరోహీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రానికి తడప్ టైటిల్ ఫిక్స్ చేశారు. తడప్ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారు. అహాన్‌శెట్టి డిఫరెంట్ లుక్స్ లో సాలిడ్‌గా అదరగొట్టేస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై అహాన్, తారా కెమిస్టీ ప్రేక్షకులను రంజింపజేయడం పక్కా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన ట్రైలర్ అన్నీ అంచనాలు అందుకోవడం ఖాయమని తాజా రషెస్ తో తెలిసిపోతుంది. పాటలు కూడా మంచి ఆదరణ పొందనున్నాయని అర్థమవుతుంది. హర్షవర్దన్ రామేశ్వర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. తడప్ హిందీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మిలాన్ లుథ్రియా డైరెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. జులై 12, 2018న విడుదలైన ఆర్‌ఎక్స్ 100 విడుదలైన రోజే పెట్టుబడి వసూలు చేసినట్టు అంచనా.