రామప్ప ఆలయంలో ఫోటో ఎగ్జిబిషన్

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయంలో ఫొటో ఎగ్జిన్ భిషన్ ప్రారంభమైంది. బుధవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై పాలంపేటలోని రామప్పలో దేవాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమ నిర్వహణలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఫొటో ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు కొనసాగుతుందని కేంద్ర సమాచార శాఖ అధికారులు తెలిపారు.