హిందీలో రీమేక్‌ కానున్న సూరారై పోట్టు

తమిళ చిత్రం సూరరై పొట్టు తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత కెప్టెన్‌ జీఆర్‌ గోపీనాథ్‌ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన
ఈ చిత్రం కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లోను ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై బాలీవుడ్‌ కన్నుపడిరది. త్వరలోనే హిందీలోను ఈ సినిమా రీమేక్‌ కానుంది. ఇప్పటికే అటు వెబ్‌ సిరీస్‌, సినిమాలతో బిజీగా ఉన్న సుధా కొంగర బాలీవుడ్‌ లో గతంలో సాలా ఖడూస్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఘన విజయం సాధించి తాజాగా ఆకాశం నీ హద్దురా చిత్ర రీమేక్‌ తో మరోసారి తన దర్శకత్వ ప్రతిభని చూపించింది. సుధ కొంగర మరోసారి సూర్యను డైరెక్ట్‌ చేయబోతుంది. దీనికి సంబంధించిన కథ చర్చలు ఈ మధ్యనే ముగిసినట్టు సమాచారం. ఇదే జరిగితే ఈ కాంబినేషన్‌లో మరో సూపర్‌ హిట్‌ రావడం ఖాయం అంటున్నారు. ఇక సూర్య నటిస్తున్న మరో సినిమా జై భీమ్‌ ప్యాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో సూర్య లాయర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. అణగారిన, పేదల కోసం పాటుపడే లాయర్‌ పాత్రలో సూర్య ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా సూర్య గత చిత్రం ఆకాశం నీ హద్దురా మాదిరిగానే డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుంది.