పవన్‌తో నటించబోతున్న అకీరా ?

సినిమాలలోకి రాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అకీరా బర్త్ డే రోజు అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుతారనే సంగతి మనందరికి తెలిసిందే. అయితే అకీరా టాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా అకీరా నందన్ స్క్రీన్ విూద కనువిందు చేయబోతున్నారనే వార్తలు సోషల్ విూడియాలో వైరల్ అవుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ ’హరి హర వీరమల్లు’ను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. మరి కొద్ది రోజులలోఈ చిత్ర షెడ్యూల్ మొదలు కానుండగా, ఇందులో కీలక పాత్ర కోసం అకీరా నందన్ని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. తండ్రి, కొడుకులు ఒకే ఫ్రేములో కనిపిస్తే ఇక ఆ సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే అకిరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. దీన్ని తెలుగులో అనువదించాలని చూస్తున్నారు.