Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మతోన్మాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

మతోన్మాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
బంగ్లాలో జరుగుతున్న దాడులపై కన్నేయాలి
కశ్మీర్‌లో ఉగ్రమూకలను అణచివేయాలి
అఫ్ఘాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టాక ఆసియా ఉపఖండంలో మరోమారు ఉగ్రమూకులు రెచ్చిపోతున్నాయి. ఇటీవలి కాలంలో బంగ్లాలో అమయాకులపై దాడులు, ఊచకోతతో పాటు, కాశ్మీర్‌లో హిందువులపై హత్యలకు తెగించడం అన్నది ఈ కోణంలోనే చూడాలి. తాలిబన్ల చూసి మరింత రెచ్చిపోయేలా వ్యవహిరిస్తున్న తీరుతో ప్రభుత్వం అప్రమత్తం కావాలి. బంగ్లాను ఆదుకుంటున్న భారత్‌ అక్కడ మతహింసలో హిందువులపై జరుగుతున్న దాడులపై మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సుబ్రమణ్య స్వామి లాంటి వారు కూడా దీనిపై పెదవి విరుస్తున్నారు. అక్కడ హిందువులు లక్ష్యంగా ఇటీవల జరిగిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలు చోట్ల ఆస్తుల ధ్వసం జరిగింది. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాకాండ ఆందోళన కలిగించేదిగా ఉంది.

ఖురాన్‌కు అపచారం జరిగిందని సాకుగా చూపి రెచ్చిపోయిన ఇస్లాం మతోన్మాద మూకలు బంగ్లాదేశ్‌లో విజయదశమి, దుర్గా ఉత్సవాలను లక్ష్యంగా చేసుకొని పలుచోట్ల హింసాకాండకు పాల్పడ్డాయి. ఇస్కాన్‌ ఆలయంపై జరిగిన దాడిలో ఆ సంస్థకు చెందిన పాతికేళ్ల కార్యకర్తతో పాటు ముగ్గురు హిందువులు మరణించినట్టు సమాచారం. బంగ్లాదేశ్‌లో గల 64 జిల్లాలో 22 జిల్లాలు ఈ విద్వేషాగ్నికి ఉద్రిక్తం కావడంతో షేక్‌ హసీనా ప్రభుత్వం అర్ధ సైనిక దళాలను దింపి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఉన్మాదుల ఆట కట్టిస్తామని, హింసకు బాధ్యులను పట్టుకొని శిక్షిస్తామని ఆమె ప్రకటించారు. ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థలు సందు దొరికినప్పుడల్లా దేశంలో హింసను సృష్టించి అక్కడి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. 1971లో బంగ్లాదేశ్‌ అవతరించినప్పుడు పాల్పడిన పలు యుద్ధ నేరాలు, ఊచకోత హత్యలకుగాను ఈ సంస్థ నేతలు ముగ్గురికి ఉరిశిక్షలు పడ్డాయి. ఇటువంటి శక్తులకు ఈ ఏడాది దుర్గ ఉత్సవాల ఘట్టం అందివచ్చిన సందర్భం అయింది.

బంగ్లాదేశ్‌లో మైనారిటీ మతస్తులపై గతంలోనూ పలుసార్లు దాడులు, హింసాకాండ చోటుచేసుకున్నాయి. ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంపైన భోలానాథ్‌గిరి ఆశ్రమం విూద దాడులు జరి గాయి. పాత ఢాకా నగరంలోని హిందు వ్యాపారుల నగల దుకాణాలను లూటీ చేశారు. సార్క్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ జరుగుతున్న సమయంలో ఢాకా నేషనల్‌ మ్యూజియంపై 5వేల మంది సాయుధ మూక దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు బాష్పవాయు గోళాలు, రబ్బరు తూటాలు ప్రయోగించారు. ఆలయాలపై దాడులు షరామామూలే. 1971నాటి యుద్ధ నేరాలకుగాను జమాత్‌`ఎ`ఇస్లావిూ ఉపాధ్యక్షులు దెల్వార్‌ హుస్సేన్‌ సయీదీకి 2013లో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ మరణశిక్ష విధించి నప్పుడు కూడా ఈ మూకలు రెచ్చిపోయాయి. మతోన్మాదం వారి తలకెక్కినా భిన్న వర్గాల ప్రజల మధ్య సామర స్యానికి తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. కశ్మీర్‌ లోయలోనూ అటు బంగ్లాదేశ్‌లోనూ చెలరేగిన మతోన్మాదం, మైనారిటీ మతస్థులపై హింసాకాండ పట్ల అప్రమత్తం కావాలి.