ఘోస్ట్‌ హీరోయిన్‌గా అమలాపాల్‌

ఘోస్ట్‌ హీరోయిన్‌గా అమలాపాల్‌
కింగ్‌ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ’ఘోస్ట్‌’. ఇందులో అఖిల్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేయబోతుండగా తాజాగా ఇందులో ఆయన సరసన అమలా పాల్‌ నటించబోతున్నట్టు తాజాగా వార్త ఒకటి సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమాలో ముందు కాజల్‌ అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్‌లో అమలా పాల్‌ వచ్చి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక కాజల్‌ తప్పుకోవడానికి కారణం ఆమె ప్రగ్నెంట్‌ అని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్‌ కన్‌ఫర్మేషన్‌ లేదు. కాగా నాగార్జున ప్రస్తుతం ’బంగార్రాజు’లో నటిస్తున్నాడు. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నాగ్‌ నటించిన ’సోగ్గాడే చిన్ని నాయాన’కి ప్రీక్వెల్‌. ఇందులో నాగ చైతన్య మరో హీరోగా, రమ్యకృష్ణ..కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.