Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పోడు భూముల సమస్యలకు పరిష్కారం…సిఎం కెసిఆర్‌

ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్ష
పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించనున్నది. ఇప్పటికే సబ్‌కమిటీ దీనిపై కసరత్తు చేసింది. అలాగే అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ కూడా
సమస్య పరిష్కరానాకి హావిూ ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సవిూక్షా సమావేశంలో అడవుల పరిరక్షణ, హరితహారంపై చర్చించారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై, హరితహారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై చర్చించినట్లు సమాచారం. పోడు సమస్యపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించి అధ్యయనం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై సీఎంకు ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, జిల్లాల కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.