Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్

మాదాపూర్, హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి

దశాబ్దాల తెలంగాణ కలను టీఆర్ఎస్ సాకారం చేసింది,

బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అన్న మాటల స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగించాం

14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను జాగృతం చేసి జాతీయ రాజకీయాలను శాసించే శక్తి గా తెలంగాణను తీర్చిదిద్దాం

పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ పట్ల నిబద్ధతతో ఉద్యమించాం

స్వరాష్ట్రాన్ని సాధించిన తరువాత అద్భుతమైన పరిపాలనతో, పరిపాలన సంస్కరణలతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు, పాలనకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం తెలంగాణతో కలిసి పోవాలని డిమాండ్ చేస్తున్నారు అంటే… తెలంగాణ పాలన ఎంత అద్భుతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు

ఇంతటి అద్భుతమైన పరిపాలన సాగుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని… 20 ఏళ్ల ద్విదశాబ్ది సంబరాల నేపథ్యంలో హైదరాబాద్, మాదాపూర్ లోని హైటెక్స్ లో ప్లీనరీని పార్టీ నిర్వహించబడుతున్నది

ఇప్పటికే వారం పది రోజులుగా మా పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు చేస్తున్నారు… ఇంత తక్కువ సమయంలో అద్భుతమైన ఏర్పాట్లు చేసిన పార్టీ నాయకులకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు

ప్లీనరీకి సుమారు ఆరు వేలకు పైగా పార్టీ ప్రతినిధులు వస్తారు

వీరందర్నీ పార్టీ రంగు గులాబి దుస్తులు ధరించి రావాలని కోరుతున్నాం

వీరందరికీ ఈరోజు సాయంత్రం నాటికి ఆహ్వాన పాసులు అందిస్తాం

పది గంటలకి ప్లీనరీ ప్రారంభం అవుతుంది

నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకొని ఉదయం 10.45 గంటల వరకు ప్లీనరీ ప్రాంగణంలోకి రావాలి

11 గంటలకు సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది

7 తీర్మానాలు పార్టీ ప్లీనరీ సమావేశంలో ప్రతిపాదిస్తాం

ఒంటి గంటకు భోజన బ్రేక్

ఆ తర్వాత పార్టీ ప్లీనరీ తదుపరి సేషన్ ప్రారంభమవుతుంది

తెలంగాణలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులు.. ఉదయమే తమ ప్రయాణాన్ని ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా

నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 50 ఎకరాల్లో పార్కింగ్ ని ఏర్పాటు చేస్తున్నాం

ప్లీనరీకి వచ్చే ఆహ్వానించిన ప్రతినిధులతో పాటు మంత్రులు ప్రజాప్రతినిధుల కు వచ్చే సహాయకులు మరియు ప్లీనరీ ఏర్పాట్లు కోసం పనిచేసే పోలీస్, జిహెచ్ఎంసి వంటి ఇతర ప్రభుత్వ సిబ్బంది సైతం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం

ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల ఏర్పాట్లను పార్టీ పూర్తి చేసింది

పార్టీ ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలో ఉండి… ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కష్టపడుతున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు..

కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో పోటీ చేస్తున్నారు

ఈ మాటను వారు కాదని చెప్తే..అందుకు సంబంధించిన సాక్ష్యాలను నేను బయట పెడతాను

గతంలో ఏ విధంగా అయితే కరీంనగర్, నిజామాబాద్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో చీకటి ఒప్పందం తో పోటీ చేశాయో… అదేవిధంగా ఈరోజు హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి…

కాంగ్రెస్ పార్టీ నాయకులు… మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి బిజెపికి ఓటు వేయమని ఎలా మాట్లాడుతారు

రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ లోపాయికారిగా ఎలా కలుస్తారు…

రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఎన్ని లోపాయికారీ ఒప్పందాలు చేసినా… కుట్రలు చేసినా విజ్ఞులయిన ప్రజలు టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చీకటి ఒప్పందాలు చేసిన… టిఆర్ఎస్ పార్టీకి చెందిన గెల్లు శ్రీనివాస్ హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తారు

మాణిక్యం ఠాకూర్ 50 కోట్ల రూపాయలకు పిసిసి పదవిని అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే చేసిన విమర్శలపై ఇప్పటివరకు స్పందించలేదు… ఇప్పటిదాకా దానిపైన మాట్లాడలేదు

ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర తాంబూలం ఇస్తుందని… కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు

గాంధీభవన్ లో గాడ్సేలు దూరారు…

ఎన్నికల కమిషన్ సైతం తన రాజ్యాంగబద్ధమైన పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది…

ఇప్పటికే ప్రారంభమైన దళిత బంధు పథకంను ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి

ఇప్పుడు పక్క జిల్లాలకు model code of conduct అంటున్న ఎలక్షన్ కమిషన్ భవిష్యత్తులో పక్క రాష్ట్రాలకు సైతం విస్తరిస్తుందేమో అనిపిస్తుంది.

ఈ సమావేశంలో మంత్రి శ్రీ.మల్ల రెడ్డి గారు,కమిటీ సభ్యులు శ్రీ.డాక్టర్.జీ.రంజిత్ రెడ్డి ,చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు,స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ శ్రీ.అరికేపూడి గాంధీ ,ఎమ్మెల్యే శ్రీ.మాగంటి గోపినాథ్ ,ఎమ్మెల్సీ శ్రీ.నవీన్ రావు ,శ్రీ.శంభిపుర్ రాజు ,శ్రీ.బంది రమేష్ ,టీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ,TSIIC చైర్మన్ గ్యాదరి బాలమల్లు ,సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ,స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.నార్నే శ్రీనివాస్ గారు,శ్రీ.ఉప్పలపాటి శ్రీకాంత్ గారు,మియాపూర్ డివిజన్ కార్పరేటర్ ,లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీ.రాగం నగేందర్ యాదవ్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.హమీద్ పటేల్, అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.దొడ్ల వెంకటేష్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ శ్రీ.సాయి బాబా , డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..