బాడీ బిల్డింగ్ బీచ్ మెడల్ కాంపిటీషన్ లోగో ఆవిష్కరణ

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో అక్రమ్ క్లాసిక్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14 – 15 తేది లలో గోవా లో జరిగే బాడీ బిల్డింగ్ బీచ్ మెడల్ కాంపిటీషన్ లోగో ను మాజీ మంత్రి డా . లక్ష్మారెడ్డి గారితో కలసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం, ఉన్నత విద్య కు 0.5 శాతం రిజర్వేషన్లు ను అమలు చేస్తున్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. హైదరాబాద్ నగరం రెస్లింగ్, బాడీ బిల్డింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్, ఫూట్ బాల్, టెన్నిస్ క్రీడలకు పుట్టినిల్లు గా మంత్రి అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. అక్రమ్ క్లాసిక్ వ్యవస్థాపకుడు అక్రమ్ ఖాన్ , ఇతర క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.