సర్కారు దవాఖానాలో డెలివరీ అయిన అడిషనల్ కలెక్టర్

◆ ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు .

◆ నిన్న పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు .

◆ అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి , డెలివరీ చేశారు .

◆ సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని , అందరికీ ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు .
◆ దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు .