మరో మంచి ప్రయత్నం నాట్యం !

మరో మంచి ప్రయత్నం నాట్యం !

కళాతపస్వి విశ్వనాథ్‌ దర్శకత్వ బాధ్యతలనుంచి విశ్రాంతి తీసుకున్న తరవాత ’సాగర సంగమం’, ’మయూరి’, స్వర్ణకమలం’ నాట్యం నేపథ్యంలో వచ్చిన తెలుగు క్లాసికల్‌ సినిమాలు మళ్లీ కానరావడం లేదు. కమర్షియల్‌ హంగులకు అలవాటు పడిన మేకర్స్‌ తాజా పరిస్థితుల్లో కళాత్మక చిత్రాలకు కాస్త దూరంగా ఉంటూ.. ఫార్ముల చిత్రాలను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే స్వతహాగా కూచిపూడి డాన్సర్‌ అయిన సంధ్యారాజు నాట్యం పట్ల ఉన్న మక్కువతో ’నాట్యం’ చిత్రం చేశారు. ఆమె కథానాయికగా నటించి, నిర్మించడం విశేషం. యువ దర్శకుడు రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించారు. పూర్తిగా నాట్యం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సితార (సంధ్యారాజు)కు చిన్నతనం నుంచే నాట్యం అంటే ప్రాణం. ఎప్పటికైనా గొప్ప నృత్యకారిణి కావాలనేది ఆమె కోరిక. తను విన్న కాదంబరి కథను నాట్యరూపంలో చేసి చూపించాలని తపన పడుతుంది. ఎంతో ఆసక్తితో నాట్యం నేర్చుకుంటుంది. తన గురువు ఆదిత్యావిూనన్‌కు ప్రియ శిష్యురాలిగా ఉంటూ క్లాసికల్‌ డాన్స్‌పై పూర్తి పట్టు సాధిస్తుంది. కాదంబరి నాట్యంతో రంగ ప్రవేశం చేయాలనుకుంటుంది. అందుకు తన గురువు అంగీకరించడు. ఎందుకంటే ఆ నాట్యం జోలికి వెళ్లిన వారు మరణిస్తుంటారు. అయినప్పటికీ గురువు మాట కాదని ఆ నాట్యం వైపు వెళ్లాలనుకుంటుంది. అదే సమయంలో పట్టణం నుంచి వచ్చిన వెస్టన్ర్‌ డాన్సర్‌ రోహిత్‌తో సితారకు పరిచయం ఏర్పడుతుంది. అతని రాక సితార జీవితంలో పలు మలుపులకు, ఆమె చేసిన ఓ పని గ్రామస్థుల ఆగ్రహానికి కారణం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఈ తరహా ధైర్యం చేసిన మేకర్స్‌ లేరనే చెప్పాలి. పూర్తిగా నాట్యంతో కథ చెప్పాలనుకున్న దర్శకుడి ఐడియా బాగుంది. కానీ కథను నెరేట్‌ చేయడం, ఎగ్జిక్యూట్‌ చేయడంలో తటబాటు కనిపించింది. కమర్షియల్‌ కోణం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆయన చెప్పాలనుకున్న పాయింట్‌ను కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్‌ చేయలేకపోయాడు. కాదంబరి కథను చెప్పాలనుకునే ప్రయత్నంలో ఆదిత్యావిూనన్‌ తన భార్యను కోల్పోవడంతో అసలు ఆ కథేంటి? ఎందుకలా జరుగుతుందన్న ఆసక్తి అందరిలోనూ కలిగించేలా చేశాడు. ఆ రన్‌ ఎక్కువ సేపు కొనసాగించలేకపోయాడు. ప్రథమార్ధంలో కాస్త సాగదీత కనిపించింది. విరామ సమయం తర్వాత కథపై ఆసక్తి పెరిగింది. సెకెండాఫ్‌ కాస్త ఎమోషనల్‌గా సాగింది కానీ.. ఇంకొంచెం భావోద్వేగాలు జోడిరచి ఉంటే

కథ మరోలా ఉండేది. చివరి 25 నిమిషాల సినిమా ఆసక్తికరంగా సాగింది. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాల్లో బలం లేదు. స్వతహాగా కూచిపూడి డాన్సర్‌ అయిన సంధ్యా డాన్స్‌ పరంగా సితార పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నటనతోనూ ఆకట్టుకుంది. క్లాసికల్‌ డాన్సర్‌గా కమల్‌ కామరాజు, వెస్టన్ర్‌ డాన్సర్‌గా రోహిత్‌ బెహల్‌ ఒదిగిపోయారు. ఇక గురువుగా ఆదిత్యా విూనన్‌ పాత్రకు వందశాతం న్యాయం చేశారు. భానుప్రియ, శుభలేఖ సుధాకర్‌ పరిధి మేరకు మెప్పించారు. శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం సినిమాకు ఎసెట్‌. పాటలతోపాటు చక్కని నేపథ్య సంగీతం అందించారు సినిమాటోగ్రఫీ బాగుంది.