నాగశౌర్య హీరో గా వరుడు కావలెను

ప్రేమకథా చిత్రం వరుడు కావలెను
నేడు గ్రాండ్‌గా సంగీత్ ఈవెంట్ నాగశౌర్య హీరోగా,. యంగ్ టాలెంటెడ్ బ్యూటీ రీతూ వర్మ జంటగా.. కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపొందించిన ప్రేమకథా చిత్రం ’వరుడు కావలెను’. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈసినిమా ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ’వరుడు కావలెను’ సంగీత్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపబోతున్నారు. శనివారం సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ దీనికి వేదిక కాబోతోంది. ఇక ఈ కార్యక్రమానికి బుట్టబొమ్మ పూజా హెగ్డే ముఖ్యఅతిథిగా విచ్చేయబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలుపుతూ.. స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. సాధారణంగా పెళ్ళికి ముందు జరిగే కార్యక్రమం సంగీత్. ’వరుడు కావలెను’ మ్యారేజ్ తో రిలేట్ అయిన సినిమా కాబట్టి.. ప్రీరిలీజ్ వేడుకనే ఇలా వెరైటీ గా ప్లాన్ చేశారని అర్ధమవుతోంది. నాగశౌర్య, రీతూవర్మ నటించిన గత చిత్రాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు.. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. ఫ్యామిలీ రిలేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ మెండుగా నిండుగా ఉన్న చక్కటి చిత్రంగా దీన్ని పేర్కొంటున్నారు నిర్మాతలు. నదియా, మురళీ శర్మ , వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్షవర్ధన్, సప్తగిరి, జబర్దస్త్ మహేశ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.