నవంబర్‌లో తెరకెక్కనున్న చిరు 154 వ చిత్రం

నవంబర్‌లో తెరకెక్కనున్న చిరు చిత్రం

మెగాస్టార్‌ చిరంజీవి ` డైరెక్టర్‌ బాబీ కాంబినేషన్‌లో ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ నవంబర్‌ నుంచి మొదలు పెట్టేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ’ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన చిరు ఇటీవలే మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే బాబీ దర్శకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బ్జడెట్‌తో నిర్మించబోతున్న చిత్రాన్ని నవంబర్‌ 6న ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మెగాస్టార్‌ బర్త్‌ డే సందర్భంగా వదిలిన ఆయన లుక్‌ అప్పటి ముఠామేస్త్రి సినిమాను గుర్తు చేసింది. చూడాలి అఫీషియల్‌గా ఈ షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్‌ ఎప్పుడు రానుందో. ఇక మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలోనూ మెగాస్టార్‌ ’భోళా శంకర్‌’ సినిమాను చేయనున్నారు. ఇందులో మిలీ బ్యూటీ తమన్నా ఆయనకి జంటగా నటిస్తోంది. అలాగే సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ కీర్తీ సురేశ్‌ చిరు చెల్లిగా

కనిపించబోతోంది.