బంగారు కానుకలకు ప్రత్యేక హుండీ..!

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ గోపురం బంగారు తాపడం కోసం భక్తులు బంగారం కానుకలు సమర్పించేందుకు ప్రత్యేక హుండీని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల విజ్ఞప్తుల మేరకు ఆలయ ఆవరణలో ఒక ప్రత్యేక హుండీని ఏర్పాటు చేస్తామని ఆలయ సీనియర్ అధికారి తెలిపారు. విమానం గోపురం బంగారు తాపడం కోసం విరాళాలు అని రాసి ఉంచిన బ్యానర్‌ను ప్రత్యేక హుండీ వద్ద ఏర్పాటు చేస్తామన్నారు.
ఇక బంగారు కానుకలు, నగదు విరాళాలను స్వీకరించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై గురువారం చర్చించామన్నారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపుతామని, ఆమోదం లభించిన వెంటనే కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు సాధారణ ప్రజలు బంగారాన్ని, నగదును విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. గత రెండు రోజుల్లో ఆలయ బ్యాంకు ఖాతాలో రూ. 27 లక్షలు జమ అయినట్లు తెలిపారు.
విరాళాలు జమచేయాల్సిన ఖాతా వివరాలు
ఖాతా నంబర్ – 6814884695
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ – IDIBOOYO11,
ఇండియన్‌బ్యాంకు, యాదగిరిగుట్ట బ్రాంచ్.