Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వేగంగా సేవలు అందిస్తే గౌరవం పెరుగుతుంది…జిల్లా ఎస్పీ

– ప్రభుత్వం అవకాశం కల్పించింది.
– భావితరాలకు శాంతియుత సమాజాన్ని అందించాలి.
– గంజాయి వినియోగించే వారిని గుర్తించండి.

— బ్లూ కోట్, పెట్రో కార్ సిబ్బందితో జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ గారు.

బ్లూ కోట్స్, పెట్రో కార్ సిబ్బందికి జిల్లా ఎస్పీ S.రాజేంద్రప్రసాద్ గారు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు శాఖలో బ్లూ కోట్స్, పెట్రో కార్ సిబ్బంది ప్రథమమైన, ముఖ్యమైన సిబ్బంది అని, ప్రతి ఫిర్యాదులపై, డయల్ 100 కాల్స్ పై ప్రథమంగా స్పందిస్తారు, కావున ఈ విధులు చాలా ముఖ్యమైనవి అని బ్లూ కోట్, పెట్రో కార్ సిబ్బందికి తెలిపినారు. పోలీసు స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు, కాలనీలు వెళ్తుంటారు మంచి ప్రజాసంబంధాలు బాగా పెంచుకోవాలి, సమాచార వనరులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ గారు ఆదేశించారు.

ప్రస్తుతం సమాజాంలో మన చుట్టూ ఉండే చాలా మంది యువత గంజాయి, మత్తు పదార్ధాలను అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు, ఇది ఇలాగే సాగుతే ఇది మన పిల్లల వరకు వచ్చే అవకాశం ఉన్నది కావున గంజాయి రహిత జిల్లాగా చేయడంలో ప్రతిఒక్కరం బాగా పని చేయాలని అన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టి సారించారు.

రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయాలని రాష్ట్ర DGP గారు ఆదేశాలు శృష్ఠంగా ఉన్నాయి. అందరం బాగా పని చేయాలి, బాధ్యతగ పని చేసే సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాము అని అన్నారు. గంజాయి వినియోగిస్తున్న యువతను గుర్తించి వారిలో మార్పుకోసం కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరినారు. ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది, వేగవంతమైన సేవలు అందిస్తే సమాజంలో పోలీసు ప్రతిభ, గౌరవం పెరుగుతుంది అన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన, శాంతియుతమైన సమాజాన్ని అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపినారు. ఈ శిక్షణ కార్యక్రమానికి DSP మోహన్ కుమార్, CI లు శ్రీనివాస్, విఠల్ రెడ్డి, SI లు శువకుమార్, విష్ణు మరియు బ్లూ కోట్, పెట్రో కార్ సిబ్బంది పాల్గొన్నారు.

– సిబ్బంది నిర్వహణ ముఖ్యం.
– పోలీసు HRMS కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించిన ఎస్పీ గారు.

పోలీసు శాఖలో అమలౌతున్న సాంకేతికత కు అనుగుణంగా సిబ్బంది సేవల నిర్వహణ చాలా ముఖ్యం అని ఎస్పీ రాజేంద్రప్రసాద్ గారు తెలిపినారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు పోలీసు హ్యూమన్ రిసోర్స్ మెంజ్మెంట్ సిస్టం కమిటీతో ఎస్పీ గారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రతిఒక్క సిబ్బంది సేవలను ప్రాణాలికతో ఉపయోగించాలని తెలిపినారు. పెరుగుతున్న అవసరాలు, జనాభా ప్రాతిపదికన సిబ్బంది నిర్వహణ చాలా ముఖ్యం అని అన్నారు. ఈ సమావేశం నందు DSP లు రఘు, మోహన్ కుమార్, AO సురేష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సూర్యాపేట టౌన్, రూరల్ CI లు ఆంజనేయులు, విఠల్ రెడ్డి, కోదాడ రూరల్ CI శివరాం రెడ్డి, RI లు నర్సింహారావు, గోవిందరావు, శ్రీనివాస్, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, IT కోర్ SI శివ కుమార్, సిబ్బంది ఉన్నారు