పుణ్యక్షేత్రాల సందర్శనలో సమంత

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమాల రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో ఇప్పుడున్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సామ్‌ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా తన బెస్ట్‌ఫ్రెండ్‌, డిజైనర్‌ శిల్పారెడ్డితో కలసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంది. ప్రస్తుతం ఆమె ఉత్తరాఖండ్‌లోని చార్దామ్‌ యాత్రకు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను శిల్పారెడ్డి తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్‌ చేసుకుంది. చార్‌ధామ్‌ యాత్ర.. బెస్ట్‌ ఫ్రెండ్‌ ఫర్‌ ఎవర్‌ అంటూ సామ్‌తో దిగిన ఫోటోలను పంచుకుంది. నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సామ్‌ మానసికంగా కుంగిపోయినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. ఆ బాధలోంచి బయట పడేందుకు సమంత ఎక్కువగా తన బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తుంది.