సైకో కిల్లర్‌ గా సుహాస్‌

టాలీవుడ్‌ లో కమెడియన్‌ గా రాణించిన సుహాస్‌ హీరోగా టర్న్‌ అయిన సంగతి తెలిసిందే. ఎంట్రీ మూవీ ’కలర్‌ ఫోటో’ కి మంచి అప్లాజ్‌ దక్కడంతో ప్రస్తుతం ఆయనతో సినిమాలు తీయడానికి పలువురు దర్శక, నిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం సుహాస్‌ హీరోగా ’ఫ్యామిలీ డ్రామా, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో ’ఫ్యామిలీ డ్రామా’ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. మొన్నామధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్స్‌ లో కాకుండా.. ఓటీటీలో విడుదలవుతుండడం గమనార్హం. ఈ నెల 29న సోనీ లివ్‌ ఓటీటీ ఎలాట్‌ ఫామ్‌ లో స్టీమ్రింగ్‌ కానుంది. సోనీ లివ్‌ సంస్థ ఈ విషయాన్ని ట్విట్టర్‌ లో తెలియచేసింది. ఇంతకు ముందెన్నడూ కనివినీ ఎరుగని సినిమా ’ఫ్యామిలీ డ్రామా’ అంటూ ఓ పోస్టర్‌ ను కూడా షేర్‌ చేసింది. ఒక సైకో తన కుటుంబ సభ్యుల్ని చంపడం ఈ సినిమా ప్రధాన కథాంశం. సైకో కిల్లర్‌ గా సుహాస్‌ అదరగొట్టినట్టు టీజర్‌ చూస్తే అర్ధమవుతుంది. మెహర్‌ తేజ్‌ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పూజా కిరణ్‌, అజయ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మరి ఈ సినిమా సుహాస్‌ కు ఏ రేంజ్‌ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.