వసూళ్లలో దూసుకెళుతున్న బ్యాచిలర్

వసూళ్లలో దూసుకెళుతున్న బ్యాచిలర్
అఖిల్ విజయం కోసం ఎంతోఆశగా ఎదురు చూస్తూ వచ్చాడు. ఎట్టకేలకు అతడికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర రూపంలో మంచి విజయం దక్కింది. మొదటి రోజు నుండి ఈ చిత్రం కి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ చిత్రం యూఎస్‌లో సైతం విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసింది. తాజా అప్డేట్ ప్రకారం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‘ మరో మైలురాయిని దాటాడు. సెకండ్ వేవ్ తర్వాత విడుదలై హాఫ్ మిలియన్ క్లబ్‌లోకి ప్రవేశించడం సరికొత్త ఫీట్ అని చెప్పొచ్చు. అఖిల్ కెరీర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మంచి టర్నింగ్ పాయింట్ గా మారింది. తెలుగు రాష్టాల్ల్రో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. మూవీకి ఇంత ఆదరణ దక్కడం పట్ట చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీ వాసు,వాసు వర్మలు నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.