ప్రభాస్‌తో నటించడం హ్యాపీగా ఉంటుంది..కృతిసనన్

ఆదిపురుష్‌ సీత కృతిసనన్‌ మనసులో మాట
ఆదిపురుష్‌ సినిమాలో సీతగా నటిస్తున్న కృతిసనన్‌ ఇటీవలే తన షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది.
ప్రభాస్‌తో నటిస్తున్నప్పుడు టెన్షన్‌ ఉండదని బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ అంటోంది. ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ సినిమాలలో ’ఆదిపురుష్‌’ ఒకటి. ఇది ఆయన నటిస్తున్న మొదటి స్టెయ్రిట్‌ హిందీ మూవీ కావడం విశేషం. మొదటిసారి ప్రభాస్‌ నటిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో ఆయన రాముడిగా కనిపించ బోతుండగా, సీత్ర పాత్రలో కృతి సనన్‌, లంకేశ్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్‌ కనిపిచబోతున్నారు. ఇటీవలే సైఫ్‌, కృతి సనన్‌ తమ పాత్రలకి సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇంచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కృతి సనన్‌ మాట్లాడుతూ.. ’స్క్రీన్‌ విూద మా జంట బాగా అందంగా కనపడుతుందని అన్నారు. అంతేకాదు ప్రభాస్‌ షూటింగ్‌ మొదలైనప్పుడు సెట్‌లో కాస్త సిగ్గుపడుతూ కనిపించారు. కానీ, ఆ తర్వాత అలవాటుపడ్డారని.. ప్రభాస్‌తో టెన్షన్‌ ఉండదు. ఆయనతో నటించడం చాలా హ్యాపీగా వుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక ప్రభాస్‌ బ్నర్త్‌ డే అయిన అక్టోబర్‌ 23న ఆదిపురుష్‌ మూవీ నుంచి సర్‌ప్రైజ్‌ రానున్నట్టు సమాచారం.