25నుంచి 2వరకు ఇంటర్‌ పరీక్షలు…మంత్రి సబితా ఇంద్రారెడ్డి

25నుంచి 2వరకు ఇంటర్‌ పరీక్షలు
కరోనాతో ప్రమోట్‌ అయిన వారికి నిర్వహణ
పూర్తి ఏర్పాట్లు చేసశామన్న మంత్రి సబిత
బోర్డు అధికారులతో ఉన్నతస్థాయి సవిూక్ష
గతంలో కరోనా కారణంగా ప్రమోట్‌ చేసిన ఇంటర్‌ విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామని స్పష్టం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేశారు. నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని సబితా ఇంద్రారెడ్డి వెల్లడిరచారు. ఈ నెల25నుంచి జరగబోయే ఇంటర్‌ పరీక్షలపై అన్ని శాఖలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు 25 నుంచి ప్రారంభం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని,కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచడం జరిగిందని చెప్పారు. 25వేల మంది ఇన్విజిలేటర్‌ లు పాల్గొంటున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఐసోలేశన్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు గంట ముందు వచ్చినా పరీక్షా కేంద్రం లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ యాజమాన్యాలు పరీక్ష నిర్వహణకు సహకరించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల సంఘాల పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. పరీక్షల టైమ్‌ లో ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానీయ, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఒమర్‌ జలీల్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరీక్షల నేపథ్యంలో ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. పరీక్షల టైమ్‌లో ఇబ్బందులు పెట్టొద్దన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలు స్పందించాయి. తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్‌ అధ్యక్షుడు గౌరీ సతీష్‌ మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల నుంచి బకాయిలు రూ.315 కోట్లు విడుదల చేయాలన్నారు. ఇప్పటికే 300కు పైగా కాలేజీలు మూత పడ్డాయని తెలిపారు. హాల్‌ టికెట్స్‌పైన ప్రిన్సిపల్‌ సంతకాన్ని ఆమోదించాలని కోరారు. తాము పంతాలకు పోవడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం దయచేసి తమ సమస్యలను పరిష్కరించాలని గౌరీ సతీష్‌ వినతి చేశారు.