హుజూరాబాద్‌లో టిఆర్ఎస్ బలగాల మకాం

హరీష్ రావు వ్యూహంతో కార్యక్రమాల రూపకల్పన
ప్రతి గ్రామం లక్ష్యంగా ప్రచార కార్యక్రామలతో ముందుకు
ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అధికార టిఆర్ఎస్ అంగబలాన్నిమొత్తం తిప్పింది. జిల్లా నాయకులే కాకుండా వివిధ జిల్లాలకు చెందిన వారంతా అక్కడే మకాం వేశారు. ఊరికి కొందరు అన్నట్లుగా ప్రచారంలో నిమగ్న మయ్యారు. మంత్రలుకు తోడుగా ఎమ్మెల్యేలు, ఎంపిలు, జడ్పీ ఛైర్మన్లు రంగంలో ఉన్నారు. జిల్లా నాయకులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలంతా హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నికలో నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రచారం 27తో ముగియనుంది. ఈ లోగా కెసిఆర్ సభ కూడా జరుగనుంది. అందుకే జిల్లాకు చెందిన పలువురు నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఆయా పార్టీల అధిష్టానాల ఆదేశాల మేరకు మంత్రి నుంచి కార్యకర్త వరకు వివిధ స్థాయిల నాయకులు హుజూరాబాద్‌కు తరలివెళ్లి ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. జిల్లా మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఇతర నేతలు అధిష్టానం నిర్దేశించిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రాంతాల్లో ప్రధాన ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వర్తి స్తున్నారు. ఉప ఎన్నికలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నీతానై చూసుకుంటూ కార్యకర్తలకు దిశ నిర్ధేశర చేస్తున్నారు. వీరికితోడు మంత్రి హరీష్ రావు అన్నింటా ముందుండి నడిపిస్తున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచార బాధ్యతల్లో మంత్రి హరీష్ రావే కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా మంత్రి హుజూరాబాద్‌లో మకాం వేసి వ్యూహ రచన చేయడంతో పాటు ప్రచారం జరుపుతున్నారు. ఇకపోతే ప్రతి మండలానికి కనీసం సుమారు వంద మంది చోటా మోటా నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గం నుంచి ప్రాతినిత్యం వహిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బాల్క సుమన్, ఆరూరి రమేశ్, తదితరులు కూడా
ఎస్సీ ఓట్లపై దృష్టి పెట్టారు. హుజూªూబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. ప్రధానంగా గ్యాస్ పెంపుదలపై హరీష్ రావు బిజెపిని నిలదీస్తున్నారు.