Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పోలీసు సంక్షేమానికి కట్టుబడ్డ ప్రభుత్వం

మతఘర్షణలు లేకుండా తెలంగాణ పోలీస్‌ కృషి
అమరుల సంస్మరణలో మంత్రి మహ్మూద్‌ అలీ
ప్రభుత్వ సహకారంతో వ్యవస్థ బలపడిరదన్న డిజిపి
పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని హోంమంత్రి మహముద్‌ అలీ అన్నారు. పోలీసు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. కరోనా సమయంలో 62 మంది పోలీసులు మరణించారు. ఏడేండ్లలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా చేశామన్నారు. బోనాలు, రంజాన్‌ను ప్రశాంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. పోలీసు అమరవీరులకు ప్రభుత్వం తరపున శ్రద్దాంజలి ఘటించామని హోంమంత్రి మహముద్‌ అలీ తెలిపారు. నగరంలోని గోషామహల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహముద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహముద్‌ అలీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డిజిపి మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ చొరవతో పోలీసు వ్యవస్థ బలపడిరదని అన్నారు. సీసీ కెమెరాలు, అధునాతన సాంకేతికత అందించిందన్నారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు అవార్డులు అందిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టా మన్నారు. పోలీసులకు జీతభత్యాలు, వాహనాలు సమకూర్చామని వెల్లడిరచారు. అత్యవసర స్పందన కోసం 11500 వాహనాలు అందించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 8.25 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 7 లక్షలు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడిరచారు. కొవిడ్‌ సమయంలో పోలీసులు అత్యుత్తమ సేవలు అందించారని చెప్పారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నామని తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.