అపోహలు వీడి … టీకా తీసుకోవాలి: గవర్నర్‌ తమిళిసై

దేశ వ్యాప్తంగా వంద కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్లు పంపిణీ పూర్తి చేసుకున్న సందర్భంగా సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని గవర్నర్‌ తమిళిసై సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘100కోట్ల టీకా డోస్‌లు పంపిణీ మార్క్‌ను చేరడం సంతోషంగా ఉంది. ఈ విజయంతో అనేక దేశాలు మన వైపు చూస్తున్నాయి. ఈ విజయం వైద్యులు, మెడికల్ ప్రొఫెషనల్స్‌ది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. దేశంలో ఉత్పత్తి చేసిన టీకా తీసుకున్నందుకు గర్విస్తున్నా. విదేశాలకు దేశీయంగా ఉత్పత్తి చేసిన టీకాలు ఎగుమతి చేశాం. అపోహ వీడి అందరూ టీకా తీసుకోవాలి. ఐసీయూలో చేరిన వారిలో ఎక్కువ మంది టీకా తీసుకోని వారే. 2- 18 వయసున్న పిల్లలకు టీకా రానుంది’’ అని గవర్నర్‌ అన్నారు.