నరసింహ స్వామికి కిలో బంగారం ఇచ్చిన MLC చిన్నపరెడ్డి

యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో విమాన గోపురం బంగారు తాపడం చేయడానికి ఒక్క కిలో బంగారాన్ని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి విరాళంగా అందించారు.
సిఎం కెసిఆర్ యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ పునర్నిర్మాణం పనులు చేపట్టడం ఆయన ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనమని, ఈ క్రమంలోనే కెసిఆర్ ప్రేరనతో తాను స్వామివారి కోసం కిలో బంగారం విరాళంగా ఇస్తున్నట్టు చిన్నపరెడ్డి తెలిపారు. దేవాలయ పునర్నిర్మాణంలో భాగస్వామినై, విమాన గోపురం బంగారు తాపడం చేయడానికి తన కుటుంబం పక్షాన , శ్రీని ఫార్మా గ్రూపు కంపెనీల తరపున ఒక కిలో బంగారాన్ని స్వామివారికి కానుకగా ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తన కుటుంబంతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.