జిల్లాలో ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.

పేదలకు న్యాయం జరిగేలా అదికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి.

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ కె. తిరుమల రెడ్డి.

జిల్లాలో 2013 ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ కె. తిరుమల రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆహార భద్రత చట్టం అమలు తీరుపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, జెడ్.పి. చైర్ పర్సన్ దీపికా యుగంధర్ ల తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ద్వారా కమిషన్ విది విధానాల అమలు ద్వారా పలు సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని అన్నారు. జిల్లా అదికారులు, స్థానిక ప్రజా ప్రతినిదులు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు నిరంతరం పర్యవేక్షణ చేయాలనీ అన్నారు. జిల్లాలో అర్వపల్లి, పెన్ పహాడ్ మండలాల్లో పలు కేంద్రాలలో పథకాల అమలు తీరును పరిశీలించడం జరిగిందని అమలు తీరుపై ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని ఈ చట్టం పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ముఖ్యంగా అరోగ్య వంత మైన మానవ సంపద ఏర్పర్చుటలో ఆహార భద్రత చట్టం ఎంతో దోహద పడుతుందని వివరించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్లు విజిలెన్స్ కమిటీ చైర్మన్ కాబట్టి చట్టం అమలు విధానం పై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రేషన్ షాపుల ద్వారా పేదలకు సరుకులు సరైన సమయంలో అందాలని ఆదిశగా సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు. మండల, జిల్లా స్థాయి సమావేశాలలో ఆహార భద్రతపై చర్చ జరగాలని సూచించారు. పథకాల అమలులో లబ్ధిదారుల హక్కులపై ఎలాంటి భంగం కలిగిన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అప్పిలెట్ చేస్తే చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం ప్రజా ప్రతినిదులు చూపిన పలు అంశాల పై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ 2013 ఆహార భద్రత చట్టం అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి పటిష్టంగా అమలు చేస్తామని అలాగే పాఠశాలలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం , అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు,బాలింతలకు, పిల్లలకు అందించే పౌష్ఠిక ఆహారాన్ని పూర్తి స్థాయిలో అందేలా చూస్తామని నిరంతర పర్యవేక్షణ చేస్తూ తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లాలో ఆహార భద్రత చట్టం పై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు భారతి, శారద, ఆర్.డి. లు రాజేంద్ర కుమార్, కిషోర్ కుమార్, పిడి కిరణ్ కుమార్, డి.పి. ఓ యాదయ్య, పిడి ఐసీడీఎస్ జ్యోతి పద్మ, DMHO Dr కోటా చలం, యంపీడిఓలు, జెడ్పీటీసీలు, యం.పీ.పీ.లు, సర్పంచులు, అదికారులు తదితరులు పాల్గొన్నారు.