Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివి

– పోలీసు అంటే ధైర్యం, అమరుల స్ఫూర్తి తో పని చేస్తాం.
– గంజాయి నిర్మూలనకు యుద్ధప్రతిపదికన పని చేస్తాం.
– గౌరవ సిఎం, DGP గార్ల ఆదేశాలతో ముందుకు వెళతాం…. ఏస్ రాజేంద్రప్రసాద్, జిల్లా ఎస్పీ.

అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన అమరవీరుల స్మారక ఫ్లాగ్ డే కార్యక్రమానికి జిల్లా కలక్టట్ వినయ్ కృష్ణా రెడ్డి , జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్  హాజరైనారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పూలమాల వేసి నివాళ్ళు ఘటించారు.

ఈ సందర్బంగా కలక్టర్  మాట్లాడుతూ సమాజ రక్షణలో పోలీసు నిర్విరామంగా పని చేస్తున్నారు అని విధుల నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది యొక్క కుటుంబాల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపినారు. ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టి తేవాలని కలక్టర్ అన్నారు.

– పోలీసు అంటే ధైర్యం, అమరుల స్ఫూర్తి తో ముందుకు వెళతాం.
– గౌరవ CM, DGP గార్ల ఆదేశాలతో గంజాయి నిర్మూలనకు యుద్ధప్రతిపదికన పని చేస్తాం…. ఎస్.రాజేంద్రప్రసాద్, ఎస్పీ.

సమాజ రక్షణలో పోలీసు రాత్రిపగలు విరామలేకుండా పని చేస్తున్నారు, సంఘవిద్రోహక శక్తులతో పోరాడి మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించి మావోయిస్టు రహిత తెలంగాణ రాష్ట్రంగా చేయడంలో పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయక పోరాటం సాగించారు అని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. ఎంతో మంది పోలీసులు పౌరుల రక్షణ కోసం, ప్రాణం, ఆస్తి రక్షణ కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టినారు అన్నారు. జిల్లాలో మావోస్టులతో పోరాడి అమరుడైన షేక్ బడే సాహెబ్, సిమి తీవ్రవాదులతో పోరాడి అమరులైన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ కు జోహార్లు తెలిపినారు. సిబ్బంది యొక్క కుటుంబాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తాము అన్నారు.

సమాజానికి పట్టిన చీడ గంజాయి, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తాము మావోస్టు ప్రాబల్యం నుండి స్వేచ్చా వాయువులు పీల్చడం కోసం పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందరో ప్రాణాలు పణంగా పెట్టినారు. సమాజంలో శాంతిభద్రత ల రక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ 1 గా ఉన్నది. ఇలాంటి పరిస్తుతుల్లో రాష్ట్రంలో గంజాయి అనేది సమాజానికి పట్టిన చీడ, క్యాన్సర్ లాంటిది అని అన్నారు. అమరులు చూపిన స్పూర్తితో గంజాయి లేని సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తాము. ఎందరో యువత ఈ గంజాయి మత్తుకు అలవాటు పడి బంగారు భవిష్యత్తు ను కోల్పోతున్నారు, భావితరాలు దీనికి బానిసలు కావొద్దు అని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ నందు తెలిపినారు, CM గారు రాష్ట్రంలో గంజాయి నిర్ములను కోసం కృతనిచ్చియంతో ఉన్నారు. రాష్ట్ర DGP గారి ఆధ్వర్యంలో గంజాయి నిర్ములానకు యుద్ధప్రాతిపదికన పని చేసి సూర్యాపేట జిల్లాలో గంజాయిని నిర్ములిస్తాం అన్నారు. శాంతియుత సమాజాన్ని నిర్మించడంలో సూర్యాపేట జిల్లా పోలీసు ముందుంటారు, సమాజాన్ని, పౌరులను, యువకులను కాపాడుకోవటంలో ప్రాణాలు సైతం లెక్కచేయం.

పోలీసు అమరవీరుల కుటుంభ సభ్యులు స్థూపం వద్ద నివాళ్ళు ఘటించినారు. అమరవీరుల పోలీసు కుటుంబాలకు గౌరవార్థం జ్ఞాపికలు అందజేసినారు.

పోలీసు కళాకారులు స్మరణ గీతాలతో ఆకటుక్కున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న DSP, CI లు, SI లు అమరుల నివాళ్ళు ఘటించారు.

ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 377 మంది జవాళ్ళు అమరుల ఐనారు, వీరి యొక్క పేర్లను DSP రవి గారు గుర్తుచేసినారు. స్మృతి పరేడ్ కమాండర్ గా RI నర్సింహారావు వ్యవహరించారు.

అమరవీరుల కుటుంభ సభ్యులు, CI లు ఆంజనేయులు, శ్రీనివాస్, నర్సింహ, RI గోవిందరాజు, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్, SI లు, సిబ్బంది ఉన్నారు.