స్థానిక యువతకు 70% ఉద్యోగాలు ఇవ్వాలి..ఎమ్మెల్యే సైదిరెడ్డి

మఠంపల్లి మండలం మట్టపల్లి పరిధిలోని నాగార్జున సిమెంట్ పరిశ్రమ ఆవరణలో క్లింకర్ ఉత్పత్తి సామర్థ్యం 2.6MTPA-4.0MTPA కు, సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 2.0MTPA-4.0MTPA పెంపునకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ.
◆ పాల్గొన్న జిల్లా అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు,ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి భారీగా పోలీసు బందోబస్తు.
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ..
హుజూర్నగర్ నిరుద్యోగ యువతకు కచ్చితంగా 70 శాతం ఉపాధిని అవకాశాలు కల్పించాలి..
ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో
ముందస్తు స్థానిక నాయకులకు ప్రజాప్రతినిధులకు, పిసిబి అధికారులు కచ్చితంగా సమాచారం ఇవ్వాలి…
Csr ఫండిగ్ లో 70శాతం భాగం స్థానిక గ్రామ పంచాయతీలకు కేటాయించాలి..
NCL సిమెంటు యాజమాన్యానికి ఒక విజ్ఞప్తి ITI కాలేజీ ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలని అన్నారు..
రహదారులు గుంతలు పడినట్లయితే మీ వంతు బాధ్యతగా కూడా వాటిపై దృష్టి పెట్టి బాగు చేసేలా ప్రయత్నించాలి..
మరో నెల రోజుల్లో హుజూర్ నగర్ నుండి మట్టపల్లి వెళ్ళే రహదారి పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు..
NCL యాజమాన్యం తమ వంతు బాధ్యతగా సామాజిక సేవ దృక్పదంతో విద్య వైద్య రంగంలో ముందుండాలి..
హుజూర్ నగర్ నియోజకవర్గం ఐటి హబ్ గా మారడానికి ఇండస్ట్రీలు కూడా ప్రధాన కారణం..
స్థానిక యువతకు అవకాశాలు ఇచ్చే విధంగా కంపెనీలు అడుగులు వేయాలని అందుకు కావలసిన పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు అందిస్తారని హామీ ఇచ్చారు…
ఇటీవల మంత్రి కేటీఆర్ తో జరిగిన మీటింగ్ లో అందరు సహకరించి స్థానికులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అంటే చాలా హర్షణీయమని అన్నారు…