23న ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన బీసీ ఉద్యోగుల సమావేశం
ఈనెల 23న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన బీసీ ఉద్యోగుల సమావేశం కానుంది. అన్ని ప్రభుత్వరంగ సంస్థల బీసీ ఉద్యోగులు రావాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ జనగణన వెంటనే చేపట్టాలన్నారు. ప్రైవేటీకరణతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పోతాయని చెప్పారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు బీసీ కులగణన కోసం అసెంబ్లీల్లో తీర్మానం చేశాయని పేర్కొన్నారు. కేసీఆర్ బీసీ బంధు పెడతానన్నారు.. ఎప్పుడు పెడతారో చెప్పాలన్నారు.