టీఆర్ఎస్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు

తెలంగాణ భవనలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ.కేటీఆర్ గారి సారథ్యంలో నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి, ఈరోజు శేరిలింగంపల్లి,మహేశ్వరం,రాజేంద్రనగర్,ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్ గారు సమావేశమై దిశానిర్దేశం చేశారు.
మంత్రులు శ్రీమతి.సబితా ఇంద్రారెడ్డి గారు,శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు,పార్టీ సెక్రటరీ జనరల్ శ్రీ.కే.కేశవరావు గారు,చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ.డాక్టర్.జీ.రంజిత్ రెడ్డి గారు, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ.అరేకపుడి గాంధీ గారు,శ్రీ.ప్రకాష్ గౌడ్ గారు,ఎమ్మెల్సీలు,నగర మేయర్,శేరిలింగంపల్లి నియోజకవర్గ డివిజన్ కార్పొరేటర్లు,జిల్లా పరిషత్ చైర్మన్ మరియు పార్టీ సీనియర్ నాయకులు,పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర గౌడ్..
ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ అక్టోబర్ 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక,అధ్యక్ష ఎన్నిక ముగిసిన అనంతరం పార్టీ ప్లీనరీ సమావేశం.నవంబర్ 15న వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది “తెలంగాణ విజయ గర్జన” సభ ఉంటుందని తెలియజేశారు.