హకీ సీనియర్ టీం, జూనియర్ టీంల వారం రోజుల క్యాంపు ముగింపు

హకీ సీనియర్ టీం, జూనియర్ టీంల వారం రోజుల క్యాంపు ముగింపు….
హకీ సీనియర్ టీం, జూనియర్ టీంల ఏంపిక
ఘనంగా టీం సభ్యులకు సన్మానం….
టోర్నమెంట్ లో సత్తా చాటండి….చైర్మెన్ కొండ విజయ్…..
జాతీయ మహిళ హకీ పోటీల్లో
హకీ పోటీల్లో తెలంగాణ హకీ మహిళ జట్టు తన సత్తా చాటలని తెలంగాణ హకీ చైర్మెన్ కొండ విజయ్ తెలిపారు. తెలంగాణ హకీ మహిళ సీనియర్, జూనియర్ జట్ల శిక్షణ క్యాంపు కార్యక్రమం హోప్ ఫౌండేషన్, హకీ రంగారెడ్డి ఆద్వర్యంలో వారం రోజుల పాటు పిజెఅర్ స్టేడియంలో నిర్వహించారు.
సీనియర్ హకీ జాతీయ పోటీలు ఉత్తర ప్రదేశ్ జాన్సీ పట్టణంలో 19 నుండి 31 వరకు నిర్వహించే హకీ జాతీయ టోర్నమెంట్ కు తెలంగాణ హకీ జట్టు ను ఏంపిక చేశారు. సీనీయర్ జట్టు కెప్టెన్ గా శృతి, వైస్ కెప్టెన్ గా మాధూరి రెడ్డి తో పాటు మెత్తం 18 క్రీడాకారులతో టీం నియామకం అయింది. వారం రోజుల పాటు చందానగర్ పిజెఅర్ స్టేడియంలో నిర్వహించిన హకీ క్యాంప్ నేటి ముగింపు జరిగింది. జూనియర్ జాతీయ టోర్నమెంట్. ఈ నెల 20 నుండి 30 వరకు జార్ఖండ్ లో నిర్వహించుచున్నారు. జూనియర్ హకీ కెప్టెన్ గా అంజలి, వైస్ కెప్టెన్ గా అపర్ణతో పాటు 18 క్రీడాకారుల సభ్యులను ఏంపిక చేశారు. ఈ మేరకు సోమవారం పిజెఅర్ స్టేడియంలో నిర్వహించిన టీం సభ్యుల సన్మాన కార్యక్రమం హోప్ ఫౌండేషన్, లయన్స్ క్లభ్ ఆద్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సన్మానంతో పాటు ట్రాక్ సూట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి హకీ సెక్రటరీ భాస్కర్ రెడ్డి తో పాటు తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.