సూరత్‌ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న 200 మంది కార్మికులు

సూరత్‌ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న 200 మంది కార్మికులు

గుజరాత్ లోని సూరత్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాస్కుల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో 200 మంది కార్మికులు పరిశ్రమలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.