Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పోలీస్ కళా జాగృతి ప్రదర్శనలకు విశేష స్పందన

 సామాజిక రుగ్మతలపై పోలీస్ కళా జాగృతి ప్రదర్శనలకు ప్రజల నుంచి విశేష స్పందన..: ట్రాఫిక్ సిఐ అంజలి*

సమాజాన్ని పట్టి పీడిస్తున్న పలు సామాజిక రుగ్మతలపై పోలీస్ కళా జాగృతి బృంద సభ్యులు తమ ఆట పాట ప్రదర్శనల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారని ట్రాఫిక్ సిఐ అంజలి అన్నారు.

నగరంలోని లకారం ట్యాంక్ బండ్ పై నిర్వహించిన కళ జాగృతి బృందం ట్రాఫిక్ ,సైబర్ నేరాలు , షీటీమ్ , డయల్ వందకు పై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి హజరైన సిఐ అంజలి మాట్లాడుతూ …

భావితరాల యువతను సన్మార్గంలో నడిపించాలంటే వారిలో సమాజం పట్ల అవగాహన రావాలనే
సంకల్పంతో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు పోలీస్ కళాకారుల విస్తృతంగా ప్రదర్శనలతో విద్యార్థులు, యువతతో పాటు పెద్దలనూ విశేషంగా ఆకట్టుకోంటుందన్న‍ారు.

మాటల ద్వారా చెప్పడం కన్నా పాటల ద్వారా విషయాన్ని చెప్పడంతో ప్రజలకు సులువుగా అర్థమయ్యేందుకు దోహదపడుతుందన్నారు.

నేటి బాలలే రేపటి పౌరులు. అందుకే వారి నుంచే మార్పు మొదలవ్వాలనే సదుద్దేశంతో
మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, బాల్యవివాహాలు,
కోవిడ్-పందొమ్మది, వెట్టిచాకిరీ వంటి సమస్యలపై యువతను మేల్కొలుపుతూ….
సమాజాన్ని అనేక సమస్యలు/రుగ్మతలు పట్టి పీడిస్తున్న సమస్యలపై అవగాహన కల్పిస్తూ.. కళాబృందాలు చేస్తున్న ప్రదర్శనలు ప్రజలపై విశేష ప్రభావం చూపుతున్నారు. కళాశాలల్లో ఈవ్‌ టీజింగ్‌లు, ర్యాగింగ్‌, డ్రగ్‌ కల్చర్‌, మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మ హత్యలు చేసుకోవడం, ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి పారిపోవడం, దుర్వ్యసనాలకు బానిసలు కావడం, సోషల్‌ మీడియా, సైబర్‌ మోసాలు, మొబైల్‌ ఫోన్లకు బానిసవడం ఆల్కాహాల్‌, ధూమపానం, పెద్దలను గౌరవించకపోవడం, చట్టాలను, సమాజాన్ని అర్థం చేసుకోకపోవడం, ట్రాఫిక్‌ రూల్స్‌ని పాటించకపోవడం, సంఘ విద్రోహక శక్తులుగా మారడం వంటి సమస్యలపై స్ధానిక ప్రజలకు పాటలు, నృత్యాల ద్వారా పోలీస్‌ కళాబృందాలు అవగాహన కల్పిస్తున్నాయి.