బైక్, చైన్ స్నాచింగ్ దొంగల అరెస్ట్

ఈ నెల 12 న ఉదయం 5 గంటల సమయంలో హుజూర్ నగర్ PSI G. స్వప్న, మరియు ID పార్టీ, పోలీస్ స్టేషన్ సిబ్బందితో మట్టంపల్లి X రోడ్ వద్ద వాహనాలు తనికి చేస్తుండగా, అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు AP-37-DS-9193 నెంబర్ గల EXTREEM మోటార్ సైకిల్ పై మట్టంపల్లి వైపు నుండి హుజూర్ నగర్ పట్టణానికి వస్తుండగా, అట్టి వ్యక్తులను ఆపి, వాహనానికి సంబంధించి డాక్యుమెంట్ అడగగా, ఇట్టి ఇద్దరు వ్యక్తులు ఎలాంటి కాగితాలు చూపించకుండా పారి పోవడానికి ప్రయత్నించగా, పట్టుబడి చేసి విచారించగా,  బండి శివ కుమార్ ,  తమ్మిశెట్టి గోపి తండ్రి వీరాంజనేయులు, వయసు: 25 సం.రాలు, నర్సారావు పేట మండలం, గుంటూర్ జిల్లా అని తెలిపారు.  వీరు గత కొన్ని సం.రాల నుండి వివిధ జిల్లాలలో బైక్ లు చైన్ స్నాచింగ్ నేరాలు చేస్తూ, పలుమార్లు జైలు కు వెళ్ళినారు. గత రెండు నెలల నుండి వీరిద్దరు ముఠాగా ఏర్పడి, హుజూర్ నగర్ పట్టణంలో రెండు బైక్ లు, మట్టంపల్లి మండల పరిధిలో ఒక బైక్, మరియు చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఒక బంగారు పూస్తెల గ్రాడు. దొంగలించినారు. వీరి నుండి సుమారు రెండు లక్షల విలువ గల 3 మోటార్ సైకిళ్ళు, లక్షన్నర విలువ గల ఒక బంగారు పూస్తెల తాడు రికవరీ చేయనైనది. చాకచక్యంగా వ్యవహరించి నేరస్తులను పట్టుబడి చేసిన PSI G.స్వప్న ID పార్టీ సిబ్బంది అజిత్ రెడ్డి, శంభయ్య, నాగరాజు, నాగిరెడ్డి ని మరియు పోలీస్ స్టేషన్ సిబ్బందిని DSP గారు అభినందించనైనది.