Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గంజాయి పై కఠినంగా వ్యవహరిస్తాం….ఎస్పీ.రాజేంద్రప్రసాద్

గంజాయి పై కఠినంగా వ్యవహరిస్తాం.
– సామర్థ్యంతో పని చేస్తున్నాము.
– ఎన్ఫోర్స్మెంట్ పెంచాం, గంజాయి రవాణా అరికడతాం.

S. రాజేంద్రప్రసాద్, ఎస్పీ సూర్యాపేట జిల్లా.

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో అమలవుతున్న హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం(HRMS) నిర్వహణ, సిబంది లో సామర్థ్యం పెంచడం, మాదకద్రవ్యాలను నివారణ అమశాలపై కమిషనర్లు, యస్.పి లతో తెలంగాణ రాష్ట్ర DGP శ్రీ.మహేందర్ రెడ్డి IPS గారు వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించినారు. వీడియో కాన్ఫిరెన్స్ నందు జిల్లా యస్.పి S. రాజేంద్ర ప్రసాద్ గారు జిల్లా పోలీసు కార్యాలయం నుండి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ రూపొందించిన HRMS – హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం యొక్క స్థితిగతులను DGP గారు జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా యస్.పి గారు మాట్లాడుతూ HRMS నిర్వహణకు జిల్లా పోలీసు కార్యాలయం నందు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి జిల్లా సిబ్బంది యొక సర్వీసు సంబంధిత అన్ని వివరాలను HRMS నందు నమోదు చేశామని యస్.పి గారు తెలిపినారు. అలాగే సిబ్బంది సామర్ధ్యం పెంచడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ గారి వివరించారు.

మూలాలను గుర్తించి గంజాయి ని అడ్డుకుంటాం…
సమాజాంలో పట్టిపీడిస్తున్న గంజాయి మహమ్మారి రవాణా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయిలో అడ్డుకోవాలని DGP గారు ఆదేశాలు జారీ చేసినారు. జిల్లాలో గంజాయి రవాణా అడ్డుకోవడానికి ప్రణాళికతో పని చేస్తున్నాము, మూలాలను గుర్తించి సరఫరా, రవాణా నివారిస్తాం, సిబ్బందితో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో కేసులు నమోదు చేస్తున్నాము. క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి గంజాయి మూలాలను గుర్తిస్తున్నాము. మండల, గ్రామ స్థాయిలో సమాచార వనరులను సద్వినియోగం చేసుకుని గంజాయి రవాణా, నిల్వలను నివారిస్తున్నాము అని ఎస్పీ గారు తెలిపినారు. గంజాయి పై సమాచారాన్ని అందజేయాలని కోరుతున్నాము. వాహనాల తనిఖీలు పెంచాం, అనుమానితులను తనిఖీ చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నాము అన్నారు.

యస్.పి గారి వెంట పోలీసు AO సురేష్, CI లు విఠల్, ఆంజనేయులు, DCRB ఇన్స్పెక్టర్ నర్సింహ, RI శ్రీనివాస్, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, IT కొర్ SI శివ కుమార్, కమ్యూనికేషన్ SI రాంబాబు, it సెల్ సిబ్బంది పాల్గొన్నారు.