ఐఫోన్ ఆర్టర్ చేస్తే… ఏం వచ్చాయో తెలుసా…?

ఐఫోన్ ఆర్టర్ చేస్తే..2 నిర్మా సబ్బులొచ్చాయి
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సిమ్రాన్‌పాల్ సింగ్ రూ.51,000 విలువ గల ఐఫోన్-12 ఆర్డర్ చేశాడు. పార్శిల్ రాగానే తీసుకుని పార్శిల్ ఓపెన్ చేసి చూపి షాక్ అయ్యాడు. ఐఫోన్ 12 (iphone 12) లేదు. రెండు నిర్మా సబ్బులు దాంతో కంగారు పడ్డాడు. పార్శిల్ ఓపెన్ చేసేటప్పుడు సరదాగా గుర్తుగా ఉంటుందని తన పాత ఫోన్ తో వీడియో రికార్డ్ చేశాడు. అదే అతనికి సాక్ష్యంగా పనికి వచ్చింది. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్‌గా మారింది. సిమ్రాన్‌పాల్ సింగ్ మాట్లాడుతూ..నేను ఐఫోన్ 12 ఆర్డర్ చేశాను. కానీ నాకొచ్చిన పార్శిల్‌లో రెండు నిర్మా సబ్బులు వచ్చాయి. దీంతో నేను ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు కాల్ చేశాను. నేను డెలివరీ బాయ్ కు ఓటీపీ షేర్ చేయలేదు కాబట్టి పార్శిల్ డెలివరీ అయినట్టు కాదు. అదే విషయాన్ని కస్టమర్ కేర్‌కు వివరించాడు. వెంటనే దీనిపై విచారణ మొదలుపెట్టింది ఫ్లిప్‌కార్ట్. పార్శిల్ డెలివరీ చేసిన వ్యక్తిని విచారించి, చివరకు తప్పు తమదేనని తెలుసుకుని..ఆ ఆర్డర్ ను క్యాన్సిల్ చేసి కస్టమర్‌కు డబ్బుల్ని రీఫండ్ చేసింది. తన బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేశాయని తెలిపాడు.