ఆధ్యాత్మిక చింతనతో మానసిక వికాసం..

*ఆధ్యాత్మిక చింతనతో మానసిక వికాసం
*-ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు*
*అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పిల్లుట్ల రఘు*
ఆధ్యాత్మిక చింతన మానవునిలో మానసిక వికాసానికి తోడ్పడుతుందని ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు అన్నారు. ఓజో ఫౌంఢేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గంలో వంద విగ్రహాల పంపిణీ చేశారు.అదేబాటలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాల పంపిణీ జరిగింది. హుజూర్‌నగర్ పట్టణంలోని సీతరాంగర్ లో (మార్కెట్ యార్డ్ వెళ్ళే దారిలో) డేర్ అండ్ డైనమిక్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్o ఛైర్మన్ పిల్లుట్ల రఘు అన్న దాన కార్యమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంలో ఓజో ఫౌండేషన్ ముందుంటుందని చెప్పారు.కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ కన్వీనర్ కుక్కల వెంకన్న,యూత్ సభ్యులు సులువ చంద్రశేఖర్,గడ్డం వీరయ్య,శివ,సైదా తదితరులు ఉన్నారు.