పెట్రోల్ బంక్ లో చిప్… రీడింగ్ లో తేడా

మునగాల మండల కేంద్రంలోని సందీప్ ఫిల్లింగ్ స్టేషన్ లో పెట్రోల్ డీజిల్ రీడింగ్ లో అవకతవకలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందగా సీఐ ఆంజనేయులు ఎస్ఐ శ్రీనివాసులు తూనికల కొలతల అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టెక్నీషియన్ ను తీసుకొని ఆకస్మాత్తుగా సందీప్ ఫిల్లింగ్ స్టేషన్ నందు తనిఖీలు నిర్వహించగా బంకు నందు చిపు లు ఏర్పాటు చేసి రీడింగ్ లో అవకతవకలు ఉన్నట్లు నిరూపణ కావడంతో సందీప్ ఫిల్లింగ్ స్టేషన్ ను సీజ్ చేసి యాజమాని రామాంజనేయులు లీజు దారుడు నరసింహారావు అదేవిధంగా చిప్ అమర్చిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఖమ్మం జిల్లా వైరా లో…

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని మధిర రోడ్డు లోని మార్కెట్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నందు ఘరానా మోసం చిప్ అమర్చి పెట్రోల్, డీజిల్ తక్కువ వచ్చే విధంగా వినియోగదారులను మోసం చేస్తున్నబంక్ పై  లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు కేసు నమోదు చేసి బంకు ని సీజ్ చేశారు.