నకిలీ విత్తనాల గుట్టు రట్టు

నకిలి విత్తనాలను తయారు చేసి అమ్ముతూ అమాయక రైతుల్ని మోసం చేస్తున్న 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు

గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీఆర్ భాస్కరం తో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు

వివరాల్లోకి వెళితె…
హైద్రాబాద్ వనస్దలిపురం కేంద్రంగా మూలపాటి శివారెడ్డి అనే వ్యక్తి ద్వారాకా సీడ్స్ పేరుతో గత కొంత కాలంగా కంపెనీ నిర్వహిస్తున్నడు..ఇతను గతంలో కర్ణాటక, తమిళనాడు మద్యప్రదేశ్, ఇండోర్ ప్రాంతాల్లో పలు సీడ్స్ కంపెనీల్లో పని చేశాడు..

. ఆ అనుభవంతో ఇక్కడ కూడా ద్వారాకా సీడ్స్ కంపెనీ ఏర్పాటు చేసుకోని కాలం చెల్లిన, లేబుల్స్ లేకుండా, లాట్ నెంబర్ లేకుండా, లెసెన్స్ లేని డీలర్లతో నాణ్యత ప్రమాణాల ద్రువీకణ పత్రాలు లేకుండా హై బ్రీడ్ అంటూ మిర్చి, టమాట, బెండ, దొండ , పుచ్చకాయ లాంటి 15 రకాల నకిలి విత్తనాల్ని మార్కెట్ లో అమాయక రైతులకు అంట గడ్తున్నడు…నిన్న సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో వీటిని గుర్తించిన పోలీసులు లోతుగా విచారణ చేసి ఈ రాకెట్ ను ఛేధించారు……

శివారెడ్డి మహబూబా బాద్, సుజాతానగర్, వత్సవాయి, వైరా ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటు చేసి డీలర్లు నియమించుకోని ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ దందాలో శివారెడ్డికి సహకరిస్తున్న ద్వారకా సీడ్స్ ఎకౌండెంట్ యాదగిరి, రీజనల్ మేనెజర్ లక్ష్మా రెడ్డి లతో పాటు శివారెడ్డి నియమించుకున్న డీలర్లు ప్రతాప్ కుమార్, జగన్మోహన్ రావు, రమణలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు…
….
వీరి వద్ద నుంచి 986 కిలోల నకిలి విత్తనాలు స్వాదీనం చేసుకున్నరు…
వీటి విలువ పదమూడున్నర కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేసారు….
రెండు కార్లు స్వాదీనం చేసుకున్నరు…..

ఈ నకీలి విత్తనాల్ని అన్నింటిని వనస్దలి పురంలోని ఓ ఇంట్లో ప్యాక్ చేసి వివిధ ప్రాంతాలకు మద్య వర్తుల ద్వారా సరఫరా చేసినట్లు తెలిపారు