పాలక్ పుల్కా తయారుచేసే విధానం.

కావలసిన పదార్థాలు:గోధుమ పిండి: 2 కప్పులు, పాలకూర: 3 కట్టలు, అల్లం: చిన్న ముక్క, పచ్చిమిర్చి: 5, వేయించిన జీలకర్ర పొడి: ఒక టేబుల్‌ స్పూన్‌, చాట్‌ మసాలా: ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం: పాలకూర తరిగి నీళ్లల్లో వేసి ఉడకపెట్టాలి. మిక్సీ జార్‌లో ఉడికిన పాలకూర, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలో ఉప్పు, పాలకూర పేస్టు వేసి కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు పక్కన పెట్టాలి. పిండిని ఉండలుగా చేసుకొని చపాతీల్లా లాటియ్యాలి. స్టౌ మీద పెనం పెట్టి రోటీలను ఒక నిమిషం పాటు కాల్చాలి.

మరో స్టౌ మీద గ్రిల్‌ పెట్టి మరో నిమిషం దానిపై కాల్చుకుంటే నోరూరించే పాలక్‌ పుల్కా రెడీ.