గోవాలో క్రాక్ సినిమా టీమ్.

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా క్రాక్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎప్పటినుంచో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఎలాగైనా ఈసారి సక్సెస్ సాధించాలని కసిగా ఉన్నాడు. రవితేజ సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మాస్ రాజా కనిపించనున్నాడు.

 

ఇటీవల ఓ సాంగ్ షూటింగ్ కోసం చిత్రయూనిట్ గోవా వెళ్ళింది. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ కంపొజిషన్లో వచ్చే ఓ లవ్లీ మెలోడీని ర‌వితేజ-శృతిహాస‌న్ ల‌పై షూట్ చేస్తున్నారు. రాజుసుందరం డ్యాన్స్ క్రొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇక గోవాలోని అందమైన లొకేషన్స్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో రవితేజ, శ్రుతిహాసన్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.