ఆంధ్రప్రదేశ్ లో వార్డు వాలంటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉపాధి దొరికింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లా ఖాళీగా ఉన్న గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 754 వాలంటీర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక గ్రామ/ వార్డ్ పరిధిలో నివసిస్తూ ఉండాలి.
వయస్సు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం : రూ.

5,000 /-
ఎంపిక విధానం: ప్రభుత్వ పథకాలపై అవగాహన, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌, గత అనుభవం ఆధారంగా..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.దరఖాస్తుల ప్రారంభ తేది: నవంబర్ 25, 2020.
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 06 , 2020.